రామ్ చరణ్ తో చేసిన ‘రచ్చ’ హిట్ కావడంతో టాలీవుడ్ బిజీ డైరెక్టర్స్ లిస్టులో సంపత్ నంది చేరిపోతాడు అని అనుకున్నారు అంతా. అయితే పవన్ తో ‘గబ్బర్ సింగ్-2’ తీసే అవకాసం అనుకోని అదృష్టంగా వచ్చినా ఆ అదృష్టం పగటి కలలా మారి పోవడంతో నిర్మాతగా మారిపోయాడు సంపత్ నంది. అయితే ఇక్కడ కుడా విధి వెక్కిరించడంతో సంపత్ నంది పని అయిపొయింది అని కామెంట్స్ చేసినవారికి రవితేజా రూపంలో అదృష్టం సంపత్ నంది ఇంట వాలింది. సంపత్ నంది చెప్పిన కధ మాస్ మహారాజాకు నచ్చడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కు సంభందించిన స్క్రిప్ట్ వర్క్ స్పీడ్ గా నడుస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అని అంటున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రవితేజ సరసన నటించడానికి హీరోయిన్ గా తమన్నా ఎంపిక అయింది అనే వార్తలు వస్తున్నాయి. ‘ఆగడు’ ఘోర పరాజయంతో టాలీవుడ్ లో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరుగాంచిన తమన్నాను, దర్శకుడిగా రాకరాక అవకాసం వచ్చిన రవితేజా సినిమాలో హీరోయిన్ గా పెట్టి సంపత్ నంది చాల సాహసం చేస్తున్నాడు అంటూ కొంతమంది సెటైర్లు కుడా మొదలు పెట్టేసారు. బహుశా ‘రచ్చ’ సినిమా విజయంతో తనకు కలిసివచ్చిన హీరోయిన్ సెంటిమెంట్ తో సంపత్ నంది ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదంటే మాస్ మహారాజ మాస్ లుక్స్ కు సరిపడే హీరోయిన్ గా ఈ మిల్కీ బ్యూటీ ని ఎంపిక చేసారా అనే విషయంలో త్వరలో క్లార్తీ వచ్చే అవకాసం ఉంది..