మీరు ఎప్పుడు చనిపోతారో మీకు తెలుసా ? లేదంటే తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ కొత్త యాప్ ని ఉపయోగించండి. మీ చావెప్పుడో ఇది చెప్పేస్తుందట. డెడ్ లైన్ అనే పేరుతో డెవలపర్స్ ఒక యాప్ ను తయారుచేశారు. ఐఫోన్ హెల్త్ కిట్ లో ఈ యాప్ ఉంది. లైఫ్ స్టైల్, ఎత్తు, బ్లడ్ ప్లజర్, నిద్ర, శారీరక శ్రమ విషయాలను బట్టి మీరు ఎప్పుడు చనిపోతారన్న విషయాన్ని ఈయాప్ తెలియజేస్తుంది. ఇప్పటివరకు ఎవరు చావు గురించి ఖచ్చితంగా చెప్పలేదు. అలాంటిది ఈ డెడ్ లైన్ యాప్ మనిషి మరణం గురించి చెబుతుందా ? అని ఆశ్చర్యపోయేవారికి యాప్ ను డెవలప్ చేసిన వాళ్లు సమాధానం చెబుతున్నారు. మనిషి తన ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ యాప్ ను హెచ్చరికగా డిజైన్ చేశామని అసలు విషయం చెప్పేశారు. అంటే ఖచ్చితంగా ఈఆప్ మనిషి మరణాన్ని చెప్పలేదు. అయితే అతని మానసిక, శారీరక అలవాట్లను బట్టి ఎంతటి ఆరోగ్యవంతుడన్నది తేలస్తుందన్నమాట.